ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజి

aeroplane
aeroplane

విశాఖ: ఐఆర్‌సీటీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌ నుండి సింగపూర్‌-మలేసియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు జూన్‌24న అర్ధరాత్రి 1215 (తెల్లారితే 25) గంటలకు హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణం ప్రారంభం కానుంది. 5 రాత్రుళ్లు, 6 పగళ్ల ప్యాకేజీలో ఒకరికి అయితే రూ.89,440. ఇద్దరు, ముగ్గురు బృందమైతే.. ఒక్కొక్కరికీ రూ.76 వేలు, పిల్లలకు (211 ఏళ్ల మధ్య) బెడ్‌తో అయితే రూ.66,840, బెడ్‌ లేకుండా రూ.57,510గా నిర్ణయించారు. ఇతర వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం నంబరు1పై ఉన్న ఐఆర్‌సీటీసీ కౌంటర్‌లో గానీ, 9078089263, 9701360695 ఫోన్‌ నంబర్లకుగానీ సంప్రదించవచ్చని తెలిపారు.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/