ప్రైవేటు, విదేశీ బ్యాంకుల బాస్‌లకు ప్రత్యేక ప్యాకేజి

రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు

RBI
RBI

ముంబయి: భారతీయ రిజర్వుబ్యాంకు ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉన్నతాధికారులకు కొత్త పరిహారం ప్యాకేజిలునిర్ణయించింది. సుమారు 50శాతం పరిహారం అప్పటికప్పుడు మార్పులు చెందేవిదంగా ఉండాలని నిర్ణయించింది. అస్థిరంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈపరిహారం నిర్ణయిస్తారు. అలాగే ఉన్నతాధికారులకు మార్పులతోకూడిన వేతనప్యాకేజితోపాటు ఉద్యోగులకు ఇచ్చే స్టాక్‌ ఆప్షన్స్‌కూడా ఉండాలనినిర్ణయించింది. ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల డైరెక్టర్లు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారులకిచ్చే వేతన ప్యాకేజి,పరిహారం వంటివి పరిస్థితులకు అనుగుణంగా మార్పులతో కూడి ఉంటాయి. ఇందుకు సంబందించిన మార్గదర్శకాలపై విస్తృత స్థాయి చర్చలుజరిపింది. డైరెక్టర్లు, సిఇఒలు, మెటీరియల్‌ రిస్క్‌టేకర్లు, కంట్రోల్‌ పంక్షన్‌ సిబ్బందికి సైతం స్టాక్‌ ఆప్షన్స్‌ అమలుచేయాలనిసూచించింది. 2012 జనవరిలో రిజర్వుబ్యాంకు పరిహారానికి చెల్లింపుల మార్గదర్శకాలను నిర్దేశించింది. 2012-13 ఆర్ధికసంవత్సరంనుంచి అమలుచేయాలని కోరింది. 2012 మార్గదర్శకాలను పునఃసమీక్షించింది. ఆర్ధిక స్థిరత్వబోర్డు సూత్రాలు, అమలుపరిచే ప్రామాణికాలు అనువంతోపాటు అంతర్జాతీయ అత్యుత్తమ ఆచరణ విధానాలను అనుసరించాలని ఆర్‌బిఐ నిర్దేశించింది.