వైద్యరంగానికి ప్రత్యేక నిధి

బడ్జెట్‌లో ఆర్థికమంత్రి ప్రతిపాదనలు

Special fund for the medical field
Nirmala sitharam


New Delhi: కరోనా మహమ్మారితోనే 2020 ఇయర్‌ అంతాసరిపోయింది. ఈ వైరస్‌ భయాలు ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆరోగ్యంపై ముందు జాగ్రత్త వహిస్తున్నారు. అందుకే హెల్త్‌ పాలసీలు పెరుగుతున్నాయి.

కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలతో ప్రపంచ దేశాలు ఆరోగ్యం పై మరింత దృష్టిసారించాయి. ఈ వైరస్‌ నేప థ్యంలో భారత ప్రభుత్వం రాను న్న బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. వైద్య రంగానికి విడిగా నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దానిని ప్రధాన మంత్రి స్వాస్థ్‌ సంవర్ధన్‌ నిధి పేరుతో ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

వైద్యరంగంలో ఎలాంటి విపత్తుల్ని అయినా ఎదుర్కొనేందుకు బడ్జెట్‌ కేటాయింపులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు చేసినట్లుగా చెబుతు న్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టను న్నారు.

ఇందులో ఈ కీలక ప్రతి పాదనలపై ప్రక టన చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి స్వాస్థ్‌ సంవర్ధన్‌ నిధి కింద ఇచ్చే మొత్తాన్ని పూర్తి గా వాడకపోయినప్పటికీ అలాగే కొనసాగించేలా రూపొందించాలని తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనల ప్రకారం ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్నుపై విధిం చే విద్య, ఆరోగ్యసెస్‌ వసూళ్లలో 25శాతం ఈ నిధికి కేటాయిస్తారు. వీటిని ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు, ప్రధాన మంత్రి స్వాస్థ్‌ సంవర్ధన్‌ నిధి పథకాలకు వినియోగిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/