అమెరికాకు షాకిచ్చిన స్పెయిన్‌!

Combat Group
Combat Group

వాషింగ్టన్‌: అమెరికాకు స్పెయిన్‌ షాకిచ్చింది. హర్మూజ్‌ జలసంధి వద్ద ఉద్రిక్తల విషయంలో అమెరికా నిర్ణయాలు మిత్రదేశాలకు కూడా నచ్చడంలేదు. అయితే తాజాగా స్పెయిన్‌ అమెరికా మిత్ర బలగాల నుండి తన ఫ్రిగేట్‌ను వెనక్కు పిలించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌ రక్షణ మంత్రి మార్గెరేట్‌ రోబ్లెస్‌ ప్రకటించారు. ఈ కారణం వల్ల స్పెయిన్‌కు చెందిన ఎఫ్‌-104 ఫ్రిగెట్‌, 2015మంది నావికులు తిరిగి వెళ్లిపోనున్నారు. వీరంతా కూడా మిషిన్‌ సర్య్కూమ్‌ నేవిగేషన్‌ మిషన్‌లో పనిచేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని బ్రసెల్స్‌లో యూరోపియన్‌ యూనియన్‌ రక్షణ మంత్రుల సమావేశంలో తీసుకొన్నారు.ఈ నిర్ణయం అమెరికా స్పెయిన్‌ సంబంధాలపై ప్రభావం చూపుతుందని అమెరికా పత్రికలు పేర్కొంటున్నాయి. అమెరికా నమ్మకాన్ని స్పెయిన్‌ కోల్పోతుందని పేర్కొంటున్నాయి. దీనిపై స్పెయిన్‌ రక్షణ మంత్రి మాట్లాడుతూ మేము యూరోపియన్‌ యూనియన్‌, అంతర్జాతీయ సంస్థలకు కట్టుబడి ఉన్నాము. స్పెయిన్‌ నమ్మకమైన భాగస్వామి. నాటో, ఈయూ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది. అని పేర్కొన్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/