మాదాపూర్ వ్యభిచార గృహంలో పోలీసులకు పట్టుబడింది ఏపీ మంత్రి అనుచరులా..?

హైదరాబాద్ నగరంలో స్పా ల మాటున వ్యభిచార దందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బయటకు స్పా సెంటర్ లుగా దర్శనం ఇస్తూ..లోపల పాడుపనులు చేస్తున్నారు. ఇప్పటికే అనేక స్పా ల పేరుతో వ్యభిచార దందా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హవెన్ స్పా బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ ముసుగు లో వ్యభిచార కేంద్రం ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు పక్కా సమాచారం తో దాడి చేశారు.

ఈ దాడిలో 10 మందివిటులు ..మరియు 10 మంది యువతులు మొత్తం 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఆరెస్ట్ అయినా విటుల్లో కొంతమంది ఏపీ మంత్రి అనుచరులు ఉన్నట్లు నగరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. విటుల్లో నెల్లూరు నగరానికి చెందిన ఐదుగురు .. బాలాజీనగర్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు ..జేపీ రెసిడెన్సీ కి చెందిన ఒకరు , లీలా ప్యాలె్‌సకు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరొకరు , ఏసీ నగర్‌కు చెందిన ఒకరు ఉన్నట్లు ..వీరంతా నగరంలో చికిత్స తీసుకుంటున్న తమ నేతను పరామర్శించడానికి వెళ్లి..అనంతరం అక్కడి నుండి హవెన్ స్పా బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ కు వెళ్లారని అంటున్నారు. ఆలా వెళ్లి పోలీసులకు అడ్డంగా దొరికారాని మాట్లాడుకుంటున్నారు.