లోక్‌స‌భ ఎంపీగా స్వీకారం చేసిన డింపుల్ యాదవ్

SP leader Dimple Yadav takes oath as Lok Sabha MP

న్యూఢిల్లీః మెయిన్‌పురి పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు డింపుల్ యాదవ్ లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. బిజెపి అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యాపై ఆమె 2.88 లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో డింపుల్‌కు 6,18,120 ఓట్లు రాగా, రఘురాజ్ షాక్యాకు 3,29,659 ఓట్లు వచ్చాయి.

అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ 2019లో మెయిన్‌పురి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు బిజెపి అభ్యర్థి ప్రేమ్ సింగ్ షక్యాపై 94,389 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈసారి ములాయం కోడలు డింపుల్ యాదవ్…అంతకు మించిన మెజార్టీతో గెలుపొందారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ కు ఉపఎన్నిక అనివార్యమైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/