29 నంది పురస్కారాలు ..ఏకైక ప్రముఖుడు

‘భారతరత్న’ ఇవ్వాలని అభిమానుల డిమాండ్‌

SP BALU
SP BALU

దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్నో పురస్కారాలు లభించాయి..

నాలుగు పదుల సంగీత ప్రస్థానంలో ఆయన 6 పర్యాయాలు జాతీయ అవార్డును దక్కించుకున్నారు.. 7 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.

1979లో వచ్చిన తెలుగు సినిమా ‘శంకరాభరణం సినిమాకు బాలుకు జాతీయస్థాయి అవార్డు లభించింది.. ‘సాగర సంగమం , ‘రుద్రవీణ సినిమాలు కూడ బాలుకి జాతీయ అవార్డును తెచ్చిపెట్టాయి.. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, నటుడిగా, సంగీ తదర్శకుడిగా కూడ ఆయన సినిమాలకు సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి బాలుకు 29 నంది పురస్కారాలు దక్కాయి..

గాయకుడిగా 25 పర్యాయాలు నంది అవార్డును సొంతం చేసుకోగా, మరోనాలుగు నంది అవార్డులు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నటుడిగా, సంగీత దర్శకుడిగా నంది పురస్కారాలు పొందారు..

తెలుగు సినిమా చరిత్రలో ఆ స్థాయి పురస్కారాలు మరెవ్వరూ పొందలేదు. కేవలం ఎపి ప్రభుత్వ అవార్డులు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సైతం బాలు అందుకున్నారు .వందల సంఖ్యలో ఆయన అవార్డులను ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందారు.

కేంద్ర ప్రభుత్వం అయన్ని 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌తో గౌరవించింది.. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ఇచ్చి గౌరవించింది..

భారతదేశ ప్రతిష్టాత్మక అవార్డు ‘భారతరత్న ను బాలుకు ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/