తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. జూన్ 4 న కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తరించానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుంది అంటే జూన్ 2 వారం లోగ నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంద్వారా ఎండలు తగ్గు ముఖం పట్టే అవకాశం వుంది . ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ఇప్పటీకె నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. జూన్‌ 4 నుంచి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించనున్నాయి .

ఇక రాబోయే 3 రోజులు పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని, హైదరాబాద్‌, చుట్టూ పక్కల జిల్లాల్లో 38 డిగ్రీల నుంచి 41 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించడంతో ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక అటు ఏపీలో మరో రెండ్రోజుల పాటు ఎండల తీవ్రత ఉండనుంది. నేడు 15 మండలాలు, రేపు 302 మండలాల్లో వడగాలులు ఉండనున్నట్లు ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది.