దసరాకి సికింద్రాబాద్ – ఏపీ మధ్య మరో మూడు ప్రత్యేక రైళ్లు

మచిలీపట్టణం-సికింద్రాబాద్ మధ్య దసరా ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: దసరా పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏపీకి మరో మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్-కాకినాడ టౌన్, మచిలీపట్టణం-సికింద్రాబాద్, లింగంపల్లి-విజయవాడ రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07550) రైలు రేపు (14న) రాత్రి 11.55 గంటలకు, మచిలీపట్టణం-సికింద్రాబాద్ రైలు (07450) రాత్రి 9.05 గంటలకు, లింగంపల్లి-విజయవాడ రైలు (07451) 18న రాత్రి 10.45 గంటలకు బయలుదేరుతాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఈ రైళ్లను దసరా పండుగ ప్రత్యేక రైళ్లుగా నడిపించనున్నట్టు తెలిపింది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ రైలు కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు మీదుగా వెళ్తుందని, మిగతా రెండు రైళ్లు కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొంది. పండుగ రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/