రెండోరోజు 27 పతకాలు సాధించిన భారత్

ఖట్మాండు: దక్షిణాసియా క్రీడల్లో భారత్ తన జోరును కొనసాగిస్తుంది. మొదటి రోజు 16 పతకాలు, రెండో రోజు 27 పతకాలు సాధించి పసిడి పతకాల పంట పండించారు. కాగా అందులో 11 స్వర్ణాలు ఉన్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్, షూటింగ్ విభాగాల్లో మనవాళ్ల జోరుకు ఎదురు లేకుండా పోయింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్లోను భారత పురుషులు, మహిళల జట్లు స్వర్ణ పతకాలు దక్కించుకున్నాయి. తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న టేబుల్ టెన్నిస్ మహిళల జట్లు ఫైనల్లో శ్రీలంకను 3-0తో ఓడించింది. అంతేకాకుండా వాలీబాల్ ఈవెంట్లోనూ రెండు స్వర్ణాలు భారత్కు దక్యాయి. షూటింగ్లో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం వచ్చాయి. తైక్వాండోలో ఓ స్వర్ణం, 3 కాంస్యాలు దక్కాయి. మహిళల 57 కేజీల విభాగంలో కశిష్ మలిక్ పసిడి పతకం నెగ్గింది. కాగా ఇప్పటి వరకు భారత్ పురుషులు, మహిళల జట్లు ప్రస్తుతం భారత్కు 43 పతకాలు అందించారు. అందులో 18 స్వర్ణాలు, 16 రజతాలు, 9 కాంస్యాలు సాధించి రెండో స్థానంలో నిలవగా.. నేపాల్ 44(23 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్యాలు)తో టాప్లో కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/