ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా అనూహ్య విజయం

Lungi Ngidi
Lungi Ngidi

సౌతాఫ్రికా: సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా అనూహ్య విజయం సాధించింది. బఫెల్లో పార్క్‌ వేదికగా బుధవారం రాత్రి జరగిన మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో చివరకు సౌతాఫ్రికా ఒక్క పరుగుతో విజయం సాధించింది. తొలి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. తెంబ బవుమా (43; 27 బంతుల్లో), కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌ (31; 17 బంతుల్లో ) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడిన ఇంగ్లాండ్‌ సునాయాస విజయం సాధించేలా కనిపించింది. ఓపెనర్‌ జేసన్‌ రా§్‌ు (70; 38 బంతుల్లో), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గావ్‌ (52;34 బంతుల్లో) ధాటిగా ఆడటంతో చివరి ఏడూ బంతుల్లో ఏడు పరుగులు అవసరమయ్యాయి. అయితే హెడ్రిక్స్‌్‌ వేసిన 18.6 బంతికి మోర్గావ్‌ ఔటయ్యాడు. దీంతో చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కు ఏడు పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో ఎంగిడి వేసిన తొలి బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. తర్వాతి బంతికి టామ్‌కరన్‌ 2 ఔట్‌ చేశాడు. మూడో బంతికి మోయిన్‌ పరుగులేమీ రాలేదు. మళ్లీ నాలుగో బంతికి మోయిన్‌ అలీ రెండు పరుగులు తీశాడు. ఐదో బంతికి మోయిన్‌ అలీ బౌల్డయ్యాడు. ఆరో బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ అదిల్‌ రషీద్‌ 1 రెండో పరుగుకోసం యత్నించగా రనౌటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో బోణి కొట్టింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/