నా బయోపిక్‌లో హృతిక్‌ రోషన్‌ నటించాలి: సౌరవ్‌ గంగూలీ

sourav ganguly & hrithik roshan
sourav ganguly & hrithik roshan

కోల్‌కతా: బాలివుడ్‌లో క్రీడాకారుల జీవిత చరిత్రలపై ఎన్నో సినిమాలు తెరపైకి వస్తున్నాయి. ధోనీ, మిల్కా సింగ్‌, మేరికోమ్‌, అజహర్‌, సచిన్‌ సినిమాలు విడుదలై అభిమానులను అలరించారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఓ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమధానం ఇచ్చారు. మీ జీవిత చరిత్రపై ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు దాదా సమధానం ఇచ్చాడు. హృతిక్‌ రోషన్‌ నటించాలని కోరుకుంటా అని చెప్పాడు. అతను నా ఫేవరేట్‌ నటుడు అని తెలిపాడు. కాగా భారత జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో దాదా సారథిగా బాధ్యతలు చేపట్టి ఇండియా టీమ్‌ను గాడిన పెట్టాడు. అద్భుత విజయాలు సాధిస్తూ భారత క్రికెట్‌ రూపురేఖలు మార్చాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. పదవిలో వచ్చిన కొన్ని రోజుల్లోనే డే/నైట్‌ టెస్టు నిర్వహించాడు. బీసీసీఐ పూర్వువైభవాన్ని తీసుకురావడానికి గంగూలీ కృషి చేసున్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/