గంగూలీ ప్రయత్నం విఫలమౌతుంది

పాక్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

sourav ganguly & rashid latif
sourav ganguly & rashid latif

ఢిల్లీ: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ రషిద్‌ లతిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి గంగూలీ తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే భారత్‌ ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్లతో సూపర్‌ సిరీస్‌ నిర్వహించాలని చూస్తున్నాడు. దీనికోసం ఇంగ్లాండ్‌ బోర్డు(ఈసిబి)తో చర్చలు కూడా జరిపాడు, అయితే టోర్నీ నిర్వహణపై ఈసిబి సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగ గంగూలీ ప్రతిపాదించిన సూపర్‌ సిరీస్‌ విఫలమౌతుందని రషిద్‌ లతిఫ్‌ అంటున్నాడు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఆ నాలుగు జట్లు మాత్రమే సూపర్‌ సిరీస్‌ ఆడాలని చూస్తే ఇతర దేశాలను విస్మరించినట్లే. ఇది క్రికెట్‌ ఆటకు ఏమాత్రం మంచిది కాదు అని అన్నాడు. కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన బిగ్‌ త్రీ మోడల్‌ విఫలమైంది. అలాగే ఈ సూపర్‌ సిరీస్‌ కూడా కచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందని భావిస్తున్నా. దాదా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అవుతుందని రషిద్‌ లతిఫ్‌ పేర్కొన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/