సిఏసికి దూరం కానున్న గంగూలి!

saurav ganguly
saurav ganguly

న్యూఢిల్లీ: క్రికెట్‌ సలహా మండలి(సిఏసి)కి గంగూలీ గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిఏసి సభ్యుడిగానే ఉంటూనే ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా పనిచేస్తున్నాడు. రెండు ఆదాయాలు వచ్చే పనులు చేసే అంశంపై దాదాపై ఓ అభిమాని ఫిర్యాడు చేశాడు. ఇప్పటికే దాదాకు నోటీసులు జారీ చేసిన అంబుడ్స్‌మన్‌, తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో శనివారం బిసిసిఐ అంబుడ్స్‌మన్‌ డీకె జైన్‌ ముందు దాదా హాజరుకానున్నాడు. దీందో గంగూలీ ఏదో ఒక దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావడంతో సిఏసికి దూరం కానున్నట్లు తెలుస్తుంది. దాదా ఏమైనా చెప్పాలనుకుంటే అంబుడ్స్‌మన్‌ ముందు చెప్పుకోవచ్చని సూచించింది. దీంతో దాదా ఢిల్లీతో కొనసాగాలంటే సిఏసికి దూరం కావాల్సి ఉంటుంది. ఐతే దాదా సిఏసికి గుడ్‌బై చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/