గంగూలీ, హర్భజన్‌ డాన్స్‌

sourav ganguly & harbhajan singh
sourav ganguly & harbhajan singh

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్‌, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఈ ఇద్దరూ కలిసి డాన్స్‌ చేశారు. ఎప్పుడూ దూకుడుగా ఉండే దాదాలో ఇలాంటి కళ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. బెంగాలీకి చెందిన ఒక టెలివిజన్‌ చానెల్‌లో ‘దాదాగిరి అన్‌లిమిటెడ్‌’ పేరుతో ఒక షో నిర్వహించారు. ఈ షోకి గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఈ షోకు పలువురు భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు హాజరయ్యారు. వీరేంద్ర సెహ్వాగ్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్‌ కైఫ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఎపిసోడ్‌ జరుగుతుండగా.. ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్‌ బాలీవుడ్ పాట ‘సెనోరిటా’ను ఆలపించారు. ఉషా ఉతుప్‌ పాడిన పాటకు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ డ్యాన్స్‌ చేసాడు. అంతేకాదు గంగూలీతోను డ్యాన్స్‌ చేయించాడు. తొలుత గంగూలీ డ్యాన్స్‌ చేయడానికి కొంత ఇబ్బంది పడిన దాదా.. చివరకు ఆకట్టుకున్నాడు. అక్కడే ఉన్న ఇతర క్రికెటర్లు క్లాప్స్‌ కొడుతూ ఎంకరేజ్‌ చేశారు. దాదా డాన్స్ వీడియోను సదరు చానెల్‌ యాజమాన్యం ట్విటర్‌లో షేర్‌ చేయడంతో.. ప్రసుత్తం వైరల్‌గా మారింది. దాదా డాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అభిమానులు తెగ లైకులు కొడుతూ.. షేర్ చేస్తున్నారు. అభిమానులు అందరూ దాదాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘దాదా సూపర్ డాన్స్’ అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ‘గంగూలీ కేక’ అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/