ప్రమాణ స్వీకారానికి రావట్లేదు

mamata banarjee
mamata banarjee

న్యూఢిల్లీ: మోది ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పశ్చిమబెంగాల్‌ సియం మమతా బెనర్జీ బుధవారం నాడు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ హింసాకాండలో మృతిచెందిన 54 మంది వ్యక్తుల కుటుంబాలను ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోది ఆహ్వానించడమే మమత తాజా నిర్ణయానికి కారణమైంది. ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్య నిర్ణయానికి కారణమైంది. ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్య పండుగలాంటిదని, అలాంటి కార్యక్రమం ఏ పార్టీని కించపరచేలా ఉండకూడదని మమత తాజా ట్వీట్‌లో నిప్పులు చెరిగారు.
ప్రధాని మోదికి అభినందనలు, తమరి ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని అనుకున్నారు. చివరి నిమిషంలో బెంగాల్‌లో జరిగిన హింసాకాండలో 54 మంది ప్రాణాలు కోల్పోయారంటూ బిజెపి చెప్పినట్లు మీడియాలో వచ్చిన వార్తలు చూశాను. ఇక్కడ ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదు. వ్యక్తిగత శతృత్వం, కుటుంబ కలహాలు, ఇతర వివాదాలు ఈ మరణాలకు కారణం కావచ్చు. బిజెపి చేసిన క్లెయిమ్‌ వల్లే ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురైందని చెప్పడానికి చింతిస్తున్నాను. మోదిజీ..ఐ యామ్‌ సో సారీ..అని ట్వీట్‌లో మమత స్పష్టం ఇచ్చారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/