గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సోఫి హెలెన్‌

Sophie Helen
Sophie Helen


హైదరాబాద్‌: బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ కోడలు, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ భార్య సోఫి హెలెన్‌ నేడు నగరంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. గాంధీలోని చిన్న పిల్లల విభాగంలోని ఎన్‌ఐసియూ, ఇంక్యుబేటర్‌, ప్రీమెచ్యూర్డ్‌, ఇన్‌బోర్న్‌, అవుట్‌ బోర్న్‌ యూనిట్లతో పాటు నియోనెటాలజీ విభాగంలోని పలు వార్డులను సందర్శించారు. ఎలిజెబెత్‌ రాణి ఆధ్వర్యంలో గాంధీ ఆస్పపత్రిలో డైమండ్‌ జూబ్లీ ట్రస్టు ద్వారా అందుతున్న సేవలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల తల్లిదండ్రులతో సోఫి హెలెన్‌ మాట్లాడారు. ఆమె వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ ఉన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/