త్వరలో కొత్త విద్యావిధానం :

New Delhi: త్వరలో కొత్త విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో విద్యారంగానికి 99300 కోట్లు కేటాయించామన్నారు. పోలీస్ ఫోరెస్స్, క్రైమ్ సైన్స్ పేరుతో కోర్సులు ప్రారంభిస్తామని ఆమె చెప్పారు. ఉన్నత విద్యకు భారత్ డెస్టినేషన్‌గా ఉండాలని ఆమె అన్నారు. మరిన్ని జాబ్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రారంభిస్తామని, డిగ్రీ లెవెల్‌లో ఆన్‌లైన్ కోర్సుల ప్రోగ్రామ్స్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆమె అన్నారు.
ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. అలాగే మిషన్ ఇంద్ర ధనుస్సు ద్వారా టీకాలు వేయనున్నట్లు తెలిపారు.
ఎలెక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి ప్రత్యేక ప్రోత్సాహకాలు :
ఎలెక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రోత్సాహకాలకు సంబంధించి త్వరలో విధివిధానాలను రూపొందిస్తామన్నారు.
లైఫ్ స్టైల్ రోగాల నివారణకు కొత్త పథకం
ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల చెప్పారు. లైఫ్ స్టైల్ రోగాల (జీవన శైలి ద్వారా సంక్రమించే) నివారణకు కొత్త పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. జీవ ఔషది కేంద్రాలను విస్తరిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. 2025 నాటికి దేశంలో క్షయ రోగాన్ని నిర్మూలిస్తామని, అలాగే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఎగుమతి రుణాల పంపిణీకి నిర్విక్ పథకం
ఎగుమతి రుణాల పంపిణీకి నిర్విక్ పథకం అమలు చేయనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎగుమతి కంపెనీలకు కొత్త ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఎగుమతి ఉత్పత్తులపై ఈ ఏడాదినుంచి పన్నులు వసూలు చేస్తామిన ఆమె చెప్పారు. ప్రతి జిల్లాను ఎగుతి కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు.
జౌళి రంగానికి రూ.1480 కోట్లు
జౌళి రంగానికి రూ.1480కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో నిర్మలా సీతారామన్ 2020-2021 బడ్జెట ను ప్రవేశ పెడుతున్నారు. జౌళి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు త్వరలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health/