ఆచార్య సెట్‌లో సోనూ సూద్ ఏం చేశాడో తెలుసా?

సోనూ సూద్.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అవసరం లేదు. కరోనా కష్టకాలంలో చాలా మంది నిరుపేదలకు తనవంతు సాయం చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచాడు. అయితే చాలా మంది వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు పంపించడంలో సోనూ సూద్ చేసిన సాయానికి యావత్ దేశ ప్రజలు ఆయన్ను దైవంలా చూస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ తరువాత కూడా సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు.

అయితే తాజాగా ఆయన 100 స్మార్ట్‌ఫోన్‌లను పంచడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. కాగా సోనూ సూద్ ఈసారి ఎవరికి ఫోన్‌లు పంచాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా సోనూ సూద్ తెలుగులో నటిస్తున్న ఆచార్య చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఆయన ఈ షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆచార్య చిత్రం కోసం పని చేస్తున్న 100 మంది కార్మికులకు ఆయన స్మార్ట్‌ఫోన్‌లను బహుమతిగా అందించాడు.

గతకొంత కాలంగా సినీ కార్మికులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని ఈ సందర్భంగా సోనూ సూద్ అన్నాడు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం ఉందని, అందుకే సినీ కార్మికులకు తనవంతుగా స్మార్ట్‌ఫోన్‌లను అందించానని అన్నారు.