ఈ నెల 24 న సోనియా కీలక సమావేశం

న్యూఢిల్లీ: ఈ నెల 24న పార్టీ ప్రధాన కార్యదర్శులు, అన్ని రాష్ట్రాల ఇన్‌చార్జీలు, పీసీసీ అధ్యక్షులతో సోనియా కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితులపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ రూపంలో జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తల అనుభవాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో సోనియా సేకరించనున్నారు. యువ నేతలు పార్టీని వీడుతుండటం, అంతర్గత కుమ్ములాటలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కోవిడ్ అంశాలు చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/