విచారణకు హాజరు కాలేను కాస్త సమయం ఇవ్వండి అంటూ ఈడీని కోరిన సోనియా గాంధీ

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ గురువారం, సోనియా గాంధీ ఈ నెల 8న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ సమన్లు పంపిన మరుసటి రోజే సోనియా కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి సోనియా ఐసోలేషన్ లో ఉన్నారు. ఈడీ విచారణ సమయానికి సోనియా కోలుకుంటుందని అంత భావించారు.

కానీ ఆమెకు ఇంకా నెగిటివ్ గానే ఉండడం తో విచారణకు హాజరు కాలేను కాస్త సమయం ఇవ్వండి అని ఈడీ ని కోరింది. తనకు ఇంకా కరోనా నెగెటివ్ రాలేదని, తాను విచారణకు హాజరుకాలేనని సోనియా ఈడీకి స్పష్టం చేశారు. తనకు కొంత సమయం కావాలని, విచారణను మరో తేదీకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోనియా కార్యాలయం ఈడీకి లిఖితపూర్వకంగా తెలియజేసింది. అటు, సోనియా తనయుడు రాహుల్ గాంధీకి కూడా ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. రాహుల్ ఈ నెల 13న ఈడీ ఎదుట హాజరుకానున్నారు.