సోనియా గాంధీపై మండిపడ్డా నిర్మలా సీతారామన్

విద్యార్థుల ఆందోళనలపై సోనియా మొసలి కన్నీరు కారుస్తున్నారు

Sonia Gandhi- Nirmala Sitharaman
Sonia Gandhi- Nirmala Sitharaman

న్యూఢిల్లీ: నూతన పౌరసత్వ (సీఏఏ) విషయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థుల పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా మొసలి కన్నీరు కారుస్తున్నారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. నాడు ఇందిరాగాంధీ పాలనలో ఢిల్లీ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులను తీహార్ జైలుకు పంపలేదా అని ప్రశ్నించారు. ఇందిర చర్య కారణంగా ఆ ఏడాది విద్యార్థులు ఓ విద్యాసంవత్సరాన్ని కోల్పోయారని గుర్తుచేశారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ దుష్ప్రచారానికి పాల్పడుతోందని నిర్మల మండిపడ్డారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు తరలివచ్చిన శరణార్థులను ఆదుకోవాలని మన్మోహన్ సింగ్ కోరారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని నిలదీశారు. నిన్న సోనియా ఓ ప్రకటన చేస్తూ, ప్రధాని మోడి,అమిత్ షాలే దేశంలో చిచ్చు పెడుతున్నారని, అమిత్ షాకు దమ్ముంటే ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని అన్నారు. యువత హక్కులను లాగేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపైనే నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు.

తాజా ప్రజావాక్కు వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/editorial/