కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి తిరిగి సోనియాకే!

వార్తల్లోని వ్యక్తి (ప్రతి సోమవారం)

Sonia Gandhi

భారత జాతీయ కాంగ్రెసు స్థాపకుడెవరు? ఏ.ఓ.హ్యూమ్‌. ఆయన విదేశీయుడు కాదా? ఆ తరువాత కాంగ్రెసు అధ్యక్షులైన వారు చాలా మంది విదేశీయులే!

జార్జియాల్‌, విలియం వెడ్డర్‌బర్న్‌, సర్‌హెన్రీకాటన్‌, యానిబిసెంట్‌, వెవిల్లీసేన్‌ గుప్తా, చాలా కాలానికి సోనియాగాంధీ!
మరి సోనియాగాంధీ కాంగ్రెసు అద్యక్షురాలైనప్పుడు కొందరు అంత హంగామా చేశారెందుకు? బహుశా వారికి చరిత్ర తెలియదేమో!

నిజానికి సోనియాగాంధీ ఇటాలియన్‌ దేశీయురాలే. ఆమె, రాజీవ్‌గాంధీ, లండన్‌లో చదువ్ఞకున్నప్పుడు ఇద్దరూ ప్రేమించుకున్నారు.

వారిద్దరి పెళ్లికి రాజీవ్‌గాంధీ మాతృమూర్తి ఇందిరాగాంధీ ముందు అంతగా ఆమోదించకపోయినా, చివరికి రాజీవ్‌, సోనియాల గాఢనురాగాన్ని కాదనలేక, వారిద్దరి వివాహానికి అంగీకరించారు.

నిజానికి రెండవ కోడలైన మేనకాగాంధీ (సంజయ్ గాంధీ) కంటె సోనియాగాంధీయే అత్తగారిని ఎంతో భయభక్తులతో చూసుకున్నది.

ఇందిర హత్య జరిగినప్పుడు సోనియా ఆమె భౌతిక కాయం ప్రక్కన కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కూర్చున్నది.

ప్రేమకు విదేశీయత, స్వదేశీయత అంటూ వ్ఞండదు. అందువల్లనే ఇందిరాగాంధీ కూడా రాజీవ్‌,సోనియాల ప్రేమకు అంగీకరించారు.

ఆమె జన్మించింది ఇటలీలోని ఓర్బసానోలో. తండ్రి ఒక సాధారణ బిల్డింగ్‌ కంట్రాక్టర్‌ స్టిషానోమైనో. తన 18వ యేట సోనియా ఇంగ్లాండ్‌లోని కేమ్‌బ్రిడ్జిలో లాంగ్వేజి టీచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంగ్లీషు, ఫ్రెంచి, భాషల అధ్యయనానికి చేరారు.

తాను చదువ్ఞకుంటున్న సంస్థ ప్రక్కనేవ్ఞన్న గ్రీక్‌ రెస్టారెంట్‌లో భోజనం బాగుంటుందని అక్కడ చేరారు. అక్కడ రాజీవ్‌తో పరిచయం ప్రణయంగా మారింది.

రాజీవ్‌తో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు మొదట్లో కాదన్నా వారిని ఒప్పించి, ఆయనతోపాటు ఆమె ఇండియా వచ్చింది.

ఆ తరువాత 1968 ఫిబ్రవరి 25న కాని, వారి వివాహం జరగలేదు. కొంతకాలం ఆమెను అమితాబచ్చన్‌ తల్లిదండ్రుల వద్ద వ్ఞంచారు. ఆ తరువాతనే వారి వివాహం జరిగింది.

భారతీయ కుటుంబ జీవితంలోని సంప్రదాయాలను, సంస్కృతిని ఆమె అర్థం చేసుకున్నారు. భారతీయ కుటుంబంలో అత్తమామల కున్న పవిత్ర స్థానాన్ని ఆమె అర్థం చేసుకున్నారు.

తదనుగుణంగా వారితో అన్యోన్యతను, ముఖ్యంగా ఇందిరతో అనిర్వచనీయమైన అనుబంధాన్ని పెంచుకున్నారు.

కాగా, రాజీయాల పట్ల రాజీవ్‌ దంపతులకు వైముఖత. అందువల్ల, సంజ§్‌ుగాంధీ మృతి వరకు రాజీవ్‌ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అతడి మృతి తరువాత ఆయన తల్లికి చేదోడువాదోడుగా వ్ఞండడానికి రాజకీయ ప్రవేశం చేయక తప్పలేదు.

సాఫీగా సాగుతున్న వారి జీవితంపై ఇందిరాగాంధీ హత్య అశనిపాతం.

1984 అక్టోబర్‌ 31వ తేదీన ఒక పక్క హంతుకుల తుపాకీగుళ్ల తూట్లతో ఇందిరాగాంధీ శరీరం రక్తం ఓడుతుండగా,

అప్పటి రాష్ట్రపతి జైల్‌సింగ్‌ ప్రధాని పదవీస్వీకరానికి రాజీవ్‌ను ఒప్పించడానికి ప్రధాని ప్రిన్సిపల్‌ సెక్రటరీ పి.సి.అలెగ్జాండర్‌ (ఆ తరువాత మహారాష్ట్ర గవర్నర్‌) ప్రయత్నిస్తున్నారు.

రాజకీయాలలో చేరవద్దని సోనియా కన్నీటితో రాజీవ్‌ను వేడుకున్నది. రాజీవ్‌ హత్య సోనియా జీవితంపై మరొక అశనిపాతం. ఆమె కట్టుకున్న ప్రేమసౌధం కుప్పకూలిపోయింది.

అయినా,ఆమె ధీరోదాత్తంగా ఆ విపత్తును ఎదుర్కొన్నది

.అయితే, ఆమె తనయుడు రాహుల్‌గాంధీకి రాజకీయాల పట్ల వైముఖ్యం. ఆయనను కాంగ్రెసు అధ్యక్ష పదవిలో కొనసాగవలసిందిగా ఎందరు ఎన్నివిధాల కోరినా, ఆయనఆసక్తి చూపడం లేదు.

కాంగ్రెసు అధ్యక్ష పదవి చివరికి మళ్లీ సోనియాకు తప్పేట్లు లేదు. కాని, ఆమె కాన్సర్‌ వ్యాధి పీడితురాలు. ఆమెను బాధపెట్టడం భావ్యమా? ఇది కాంగ్రెస్‌వాదులు ఆలోచించవలసిన ప్రశ్న!

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/