సోనియా, రాహుల్‌కు ఈడీ నోటీసులు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ చేశారు. గురువారం తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది. మరోవైపు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ.. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జెవాలా ఆరోపించారు. మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తోందన్నారు. తమ నేతలకు నోటీసులు ఇవ్వదాన్ని సరికొత్త పిరికిపంద చర్య అని సుర్జేవాలా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/