సోనియా గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆర్థిక మంత్రి

nirmala sitharaman
nirmala sitharaman

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అపోహలు అవసరంలేదని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌ అన్నారు. సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలపై నిర్మల సీతారామన్‌ స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆమె విమర్శలు చేశారు. సోనియా గాంధీ ప్రజల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారని నిర్మాలా సీతారామన్‌ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు ముడిపెడుతూ ప్రజల్లోకి తప్పుడు సందేశం పంపుతున్నారని ఆమె మండిపడ్డారు. ప్రతిపాదిత ఎన్‌ఆర్‌సీ విధివిధానాలను ఇంకా రూపొందించలేదని అన్నారు. సీఏఏని మరోసారి క్షుణ్నంగా చదివి వాస్తవాల్ని అర్థం చేసుకోవాలని ప్రజల్ని కోరారు. ఎన్నార్సీ కులాలు, మతాలు, వర్గాలకు సంబంధించినది కాదని వివరించారు. పౌరసత్వ చట్ట సవరణతో దేశ పౌరులకు ఎటువంటి నష్టంలేదన్నారు. కొందరు తప్పుదారి పట్టించే వారి మాటల్ని నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆప్‌, వామపక్షాలు ఈ విషయంలో లేనిపోని వదంతులు వ్యాప్తి చేస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/