మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రముఖులు నివాళులు

Sonia, Manmohan Singh
Sonia, Manmohan Singh

న్యూఢిల్లీ:మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా ఆమెకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ తదితరులు ఇందిరకు నివాళులు అర్పించారు. శక్తిస్థల్ లో వారు ఇందిరకు నివాళులు అర్పించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. దేశం కోసం ఇందిర చేసిన సేవలను, ఆమె త్యాగనిరతిని వారు కొనియాడారు. ఇందిర జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఇందిర ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా సోనియాగాంధీ కాంగ్రెస్ శ్రేణులను కోరారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/