జాతినుద్దేశించి సోనియాగాంధీ వీడియో సందేశం

కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి

sonia gandhi
sonia gandhi

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్‌డౌన్‌ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలనుంచి లాక్‌డౌన్‌ పొడగించాలని వినతులు వచ్చాయి. దీనిపై ఒక నిర్ణయం వెల్లడించేందుకు ప్రధాని మోదీ నేడు జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. కాని అంతకనాన్న ముందే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ జాతిని ఉద్దేశించి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నా ప్రియమైన దేశ ప్రజలారా … అంటూ ప్రారంభమయ్యే ఆ వీడియోలో దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, చేతులు ఎప్పటికపుడు శుభ్రంచేసుకోవడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని, వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు తమ భార్యా పిల్లలను, తల్లితండ్రూలను వదలి పోరాడుతున్నారని, వారందరికి ధన్యవాధాలు తెలిపారు. వైరస్‌ భయాందోళనలు తగ్గేవరకు ప్రజలు సురక్షితంగా ఉండాలని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రజలంతా శాంతి సహనం , సంయమనం పాటిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆహరధాన్యాలను ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర చర్యలను ప్రశంశిస్తునే, ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారని ,దీని కారణంగా దేశం చాలా నష్టపోతుందని తెలిపారు.

YouTube video

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/