డీకే శివకుమార్‌ను కలిసిన సోనియాగాంధీ

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న డీకే శివకుమార్

Sonia Gandhi
Sonia Gandhi

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో కర్ణాటక కాంగ్రెస్‌ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయను కలవాడనికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ ఉదయం తీహార్ జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. భేటీ అనంతరం మీడియాతో డీకే సురేశ్ మాట్లాడుతూ, శివకుమార్ వెంట పార్టీ మొత్తం ఉంటుందని సోనియా తెలిపారని చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసును పెట్టారని… ఇతర కాంగ్రెస్ నేతలను కూడా టార్గెట్ చేశారని… బిజెపితో మనం పోరాటం చేసి, బయటపడాలని సోనియా చెప్పారని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/