సెలవులకు సిమ్లా చేరుకున్న సోనియా గాంధీ

సిమ్లా : కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ హాలీడేస్‌ గడిపేందుకు సోమవారం ఉదయం సిమ్లా చేరుకున్నారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంకా వాద్రా కూడా ఉన్నారు. వీరు షిమ్లాలో మూడు రోజులపాటు విడిది చేయనున్నారు. ఇక్కడి నుంచే పంజాబ్‌ పరిణామలను సమీక్షించనున్నారు. ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సిమ్లా వచ్చారు. సెలవులు గడిపేందుకే ఇక్కడికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఛాబ్రాలో నిర్మించిన ప్రియాంక ఇంట్లోనే సోనియా బస చేయనున్నారు.

ఛాబ్రా ఇంటిలో మూడు రోజులపాటు ఉంటారు. ధాలి నుంచి సోనియా కాన్వాయి ఛాబ్రా చేరుకున్నది. కాన్వాయిలో 15 వాహనాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే సోనియా గాంధీ పంజాబ్‌ పరిణామాలను సమీక్షిస్తారు. ప్రియాంక వాద్రా తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయమే ఛాబ్రా వచ్చారు. సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్‌ పర్యటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. సోలన్ నుంచి షాలఘాట్ వరకు అడుగడుగునా పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రియాంక ఇంటి చుట్టూ కూడా పోలీసులతో భద్రత పెట్టారు. ఇంటి చుట్టూ ఎవరూ వెళ్లడానికి అనుమతించడం లేదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/