లాక్‌డౌన్‌ తరువాత పరిస్థితేంటి..?

కేంద్రాని ప్రశ్నించిన సోనియాగాంధీ

sonia gandhi
sonia gandhi

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల తో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో సోనియా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనే దానిపై ముఖ్యమంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల తరలింపు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఆమె ఈ సమావేశంలో చర్చించారు. తమ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోనియాగాంధీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసే అంశంలో కేంద్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాగా లాక్‌డౌన్‌ను ఎంతకాలం కొనసాగిస్తారనే అంశంపై కేంద్రం ఎలాంటి ప్రాతిపదిక అవలంభిస్తుందో చెప్పాలని సోనియాగాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/