చిదంబరంను కలిసిన సోనియా, మన్మోహన్

Sonia Gandhi, Manmohan Singh
Sonia Gandhi, Manmohan Singh

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను కలిశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి ఈ నెల 5వ తేదీ నుంచి ఆయన తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. భేటీ అనంతరం చిదంబరం ట్వీట్ చేశారు. ‘నా తరపున ట్వీట్ చేయాల్సిందిగా నా కుటుంబసభ్యులను అడిగా. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నన్ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ బలంగా, ధైర్యంగా ఉన్నంత వరకు నేను కూడా బలంగా, ధైర్యంగానే ఉంటా’ అని ట్వీట్ లో తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/