వలస కార్మికుల ఖర్చులు మేమే ఇస్తాం

కావాలంటే తమ పార్టీ తరఫున వలస కార్మికుల రైలు ప్రయాణాలకు అవసరమైన డబ్బిస్తామని కేంద్రానికి సోనియా లేఖ

AICC Chief Sonia Gandhi
AICC Chief Sonia Gandhi

న్యూఢిల్లీ: దేశావ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ కరణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకొన వారు, స్వస్థలాలకు రైల్లో వెళ్లాలంటే, టికెట్ డబ్బు చెల్లించాలని అధికారులు చెప్పడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. పేదలు, వలస కార్మికుల రైలు ప్రయాణాలకు అవసరమైన డబ్బులను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని, డబ్బు తీసుకుని, వారికి అవసరమైనన్ని రైళ్లను ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈమేరకు సోనియా సోమవారం కేంద్రానికి ఓ లేఖను రాశారు. ఇండియా వృద్ధికి తమవంతు సహకారాన్ని అందించే కార్మికులకు అండగా నిలిచి, వారిని ఆదుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అందించే చిరుసాయం ఇదని ఆమె తెలిపారు.

‘భారత జాతి వృద్ధికి మన కార్మికులే అంబాసిడర్లు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, ఉచితంగా విమానాల్లో వారి స్వరాష్ట్రాలకు చేర్చడం ప్రభుత్వం బాధ్యత. గుజరాత్ లో కేవలం ఓ కార్యక్రమానికి ప్రజల తరలింపు, వారికి ఆహారం కోసం రూ. 100 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ప్రధాన మంత్రి కరోనా నిధికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 151 కోట్లను అందించింది. ఆ నిధులతో కనీసం వలస కార్మికులకు ఉచిత రైలు ప్రయాణాన్ని అందించలేరా? ఇంతటి కష్టకాలంలో, వారిని ఆదుకునే మంచి మనసు ఎందుకు రావడం లేదు?’ అని సోనియా ప్రశ్నించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/