22న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో సోనియా భేటి

Sonia Gandhi
Sonia Gandhi

న్యూఢిల్లీ: ఈనెల 22వ తేదీన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్డీయే కూటమిలో లేని పార్టీలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చించనున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని పలు సర్వే నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో.. ఫలితాల తరువాత బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ భేటీకి సీనియర్‌ నాయకులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులను, ఇంచార్జులను ఆహ్వానించారు . ఈ నేపథ్యంలో 23వ తేదీన ప్రతిపక్ష పార్టీల నేతలందరితోనూ సోనియా సమావేశం కానున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ సోనియా లేఖలు రాసి ఆహ్వానించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/