హాస్పటల్ లో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోనిఓ ప్రవైట్ హాస్పటల్ లో చేరారు. రెగ్యులర్ చెకప్ కోసం ఆమె హాస్పటల్ లో చేరినట్లు తెలుస్తుంది. న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పటల్ లో సాధారణ టెస్ట్ ల నిమిత్తం ఆమె హాస్పటల్ లో చేరినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా కరోనా బారిన పడిన తరువాత కొన్ని రోజులు సర్ గంగారామ్ ఆసుపత్రిలోనే ఉన్నారు. అప్పటినుంచి ఆమె రెగ్యూలర్ చెకప్ అక్కడే చేయించుకుంటున్నారు. సోనియాతో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా హాస్పటల్ కు వెళ్లడం జరిగింది.

మంగళవారం నుంచి శ్వాసకోశ సమస్యతో సోనియా బాధపడుతుందని, ఆ కారణంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఉత్తరప్రదేశ్‌లో సాగుతున్న జోడో యాత్ర నుంచి వెనుదిరిగారిని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు తొమ్మిది రోజుల తర్వాత ఢిల్లీలో తిరిగి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర మంగళవారం ఘజియాబాద్ వద్ద ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక వాద్రా, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరుక్ అబ్దుల్లా రాహుల్ పాదయాత్రను యూపీలోకి ఆహ్వానించారు. అనంతరం రా మాజీ చీఫ్ ఏఎస్ దులత్ కూడా పాదయాత్రలో పాల్గొని దానికి మద్దతు పలికారు. యూపీలో 7 కిలో మీటర్ల మేర యాత్ర సాగిన సమయంలో సోనియా ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాహుల్, ప్రియాంక అక్కడితో విరామం పలికి ఢిల్లీకి తిరిగి వచ్చారు.