మరోసారి హాస్పిటల్ చేరిన సోనియా గాంధీ

న్యూఢిల్లీః కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో చేర్పించారు. బ్రాంకైటీస్ వ్యాధికి సోనియా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె హాస్పిటల్‌లో చేరడం ఇది రెండవసారి. జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో ఆమె బాధపడ్డారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.