శారీ నాట్ సారీ..

Sonam Kapoor New Look
Sonam Kapoor New Look

బాలీవుడ్ లో స్టైల్ పీక్స్ లో ఉండే హాటు బ్యూటీల లిస్టులో సోనమ్ కపూర్ పేరు తప్పనిసరిగా ఉంటుంది.  లాస్ట్ ఇయర్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న తర్వాత శ్రీమతి సోనమ్ గా మారింది కానీ హాటు వ్యవహారం మాత్రం అసలు మారలేదు. లోపల మాసు అలానే ఉంది అన్నట్టుగా లోపల హాటు అలానే ఉంది. సోనమ్ నటించిన తాజా చిత్రం మరో వారం లో రిలీజ్ అవుతోంది.  దీంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
రీసెంట్ గా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కత్తిలా రెడీ అయిన ఈ భామ ఒక ఫోటో షూట్ లో కూడా పాల్గొంది.  ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో.. నెటిజన్లతో షేర్ చేసుకుంది.  ఈ ఫోటోలకు “శారీ నాట్ సారీ #ది జోయా ఫ్యాక్టర్ ప్రమోషన్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలలో సోనమ్ ధరించిన చీరను అర్జున్ సలూజా డిజైన్ చేశారు.  ఇందులో డిజైన్ చేసేందుకు ఏముంది అని పుసుక్కున అనకుండా గమనించండి. డిఫరెంట్ గా ఉంది. ఇక బ్లౌజ్ కూడా ఫుల్ డిఫరెంట్.. ఒక పెద్ద జిప్పు.  కాలర్.. ఫుల్ స్లీవ్స్ ఎంత డిఫరెంట్ గా ఉండాలో అంత డిఫరెంట్ గా ఉంది