లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న సిఎం కుమారుడు

Ashok Gehlot-Vaibhav Gehlot
Ashok Gehlot-Vaibhav Gehlot

జైపూర్‌: రాజస్థాన్‌ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ తనయుడు వైభవ్‌ గెహ్లాట్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ 31 మందితో కూడిన ఎంపీ అభ్యర్థుల జాబితాను గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది. అందులో అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్‌కు జోధ్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. కేంద్ర మాజీ మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్‌కు అల్వర్ లోక్‌సభ స్థానాన్ని ఖరారు చేసింది. మరో కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తనయుడు మన్వేంద్ర సింగ్‌కు ఈ జాబితాలో చోటుదక్కింది. మన్వేంద్ర సింగ్‌ బార్మర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ 31 మంది జాబితాతో కలిపి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 293 మంది అభ్యర్థులను ప్రకటించింది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/