జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి : సోము వీర్రాజు

somu veerraju

అమరావతి: జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్ కులేఖ రాశారు. ఏపీలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జనవరి లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చూపిన ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలో మూడు లక్షలకు పైగా ఖాళీలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

అధికారంలోకి వచ్చిన నటి నుంచి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని సోము వీర్రాజు గుర్తు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వల్ల పారదర్శకత లోపిస్తుంది చెప్పారు. జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో వల్ల నిరుద్యోగ యువత నిరాశలలో కొట్టిమిట్టాడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ వయసు దాటి పోతుందని ఆందోళన వ్యక్తి చేసున్నారన్నారు. నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్నా పోస్ట్లులు భర్తీ చేయని కారణంగా త్రాగునీటి ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయని తెలుపుతూ సోము వీర్రాజు లేఖ రాశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/