టీడీపీతో పొత్తుపై సోమువీర్రాజు క్లారిటీ

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సోమువీర్రాజు. ఒకవేళ అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనసేన, బీజేపీలు అదికారికంగా పొత్తులోనే ఉండగా.. అవసరం అనుకుంటే జనసేనతో కలుస్తామని చెప్పడం వెనక అర్థం ఏంటనేది అంత మాట్లాడుకుంటున్నారు.

ఇక వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై సోము విమర్శలు చేసారు. దేశంలోనే అతి పెద్ద మతతత్వ పార్టీ వైఎస్సార్ సీపీయేనని సోము వీర్రాజు విమర్శించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. చర్చిలను ప్రభుత్వ నిధులతో కట్టిస్తోంది వైసీపీ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. కానీ, బీజేపీని పదే పదే మతతత్వ పార్టీ అని పేర్కొనడం సమంజసం కాదన్నారు. హిందూ ప్రాంతాల్లో మసీదులను దగ్గరుండి వైసీపీ ఎమ్మెల్యేలే కట్టిస్తున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే బీజేపీపై ముస్లింలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. హిందువులు గురించి మాట్లాడితే మతతత్వం అవుతుందా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏదో లబ్ది చేస్తున్నామని.. తమకే ఓట్లేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ భావిస్తున్నారని, అసలు రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీ చలవేనని వ్యాఖ్యానించారు.