సోము వీర్రాజు ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫేస్ బుక్‌ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సోషల్ నేటి వర్కింగ్ సైట్స్ లలో పేస్ బుక్ ఒకటి. ఇంటర్నెట్ వినియోగించే చాలామందికి ఫేస్ బుక్ లో ఖాతా ఉంటుంది. ప్రస్తుతం అందరూ ఈ ఫ్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తున్నారు. సామాన్య ప్రజలే కాకుండా సినీ , రాజకీయ , బిజినెస్ రంగాలకు చెందిన వారు సైతం పేస్ బుక్ లో యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవల పేస్ బుక్ యూజర్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ.. హ్యాకర్లు కూడా పెరుగుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు సినీ స్టార్స్ తో పాటు రాజకీయ నేతలకు సంబదించిన ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అకౌంట్ లను హ్యాక్ చేసిన నేరగాళ్లు..తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫేస్ బుక్‌ అకౌంట్ ను సైతం హ్యాక్ చేసారు. ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందే ఖాతా సేవలు స్తంభించాయి. హ్యాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగతంగా అవహేళనకు గురి చేసే విధంగా రాతలు ఉన్నాయి. తాజా పరిణామాలను నివేదిక రూపంలో సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయనున్నారు.