పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయాలి

అమరావతి: నేడు ఓ మీడియా సమావేశంలో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ,ఓట్ల తొలగింపులో వైఎస్‌ఆర్‌సీపీ కుట్ర బయటపడిందని ఆరోపించారు తెలంగాణలో మెయిల్ ఐడీల ద్వారా 59 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని, రోజుకు లక్షన్నర చొప్పున ఫారం7 అప్ లోడ్ చేసే ప్రయత్నం చేశారని, ఈసీ కేసులు పెట్టమని చెప్పడంతో ప్రస్తుతం రోజుకు మూడు వందల ఫారం7 అప్ లోడ్ అవుతున్నాయని ఆరోపించారు. కేంద్రాన్ని, తెలంగాణాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ గుర్తును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా సోమిరెడ్డి డిమాండ్ చేశారు