ప్రకాష్ రాజ్ ఓటమికి ఆ స్టేట్మెంటే కారణం – టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ప్రకాష్ రాజ్ ఓటమికి ఆ స్టేట్మెంటే కారణం - టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

మా ఎన్నికల బరిలో మంచు విష్ణు భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించారు. ముందు నుండి కూడా విష్ణు చక్కటి ప్లాన్ తో ముందుకెళ్లి విజయం సాధించారు. ముఖ్యంగా తన మేనిపెస్టో అందర్నీ ఆకట్టుకుంది. దీంతో విష్ణు కు ఓటు వేసి గెలిపించారు. ప్రకాష్ రాజ్ ఓటమి ఫై తెలుగుదేశం నేత సోమిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ ఆయన్ని మా ఎన్నికల్లో ఓడిస్తోందని వారం క్రితమే మిత్రులతో షేర్ చేసుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు వినయవిధేతలే ఆయన విజయానికి నాంది అవుతున్నాయని చెప్పానన్నారు. ఇప్పుడు అదే నిజమైంది అన్నారు.

సీనియర్ల ఆశీస్సులు తనకు అవసరం లేదని ఇచ్చిన స్టేట్మెంట్‌తో ప్రకాష్ రాజ్ ఓటమికి బాటలు వేసుకున్నారన్నారు. విజేతగా నిలిచిన విష్ణుకు అభినందనలు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారగా.. కొంతమంది ఆయన చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. మా ఎన్నికల ఫలితాలపై కామెంట్స్ చేయడం సరికాదంటున్నారు.

విష్ణు మంచు ప్యానెల్‌లో ..జనరల్ సెక్రటరీగా జీవితపై రఘుబాబు విజయం సాధించగా, ట్రెజరర్‌గా శివబాలాజీ, నాగినీడుపై విజయం సాధించారు.