ఆ ముగ్గురు హీరోల వల్లే జగన్ చిత్రసీమ ఫై రివెంజ్ తీర్చుకుంటున్నాడా..? సోమిరెడ్డి కామెంట్స్ కు అర్ధం అదేనా..?

ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్స్ ధరల విషయం హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రంలో చాల సమస్యలు ఉన్నప్పటికీ వాటికీ గాలికి వదిలేసి..ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రసీమ ఫై ఫోకస్ పెట్టడం ఏంటి..? అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో రూ.5 లకు టీ కూడా రాని ఈరోజుల్లో సినిమా టికెట్ ధర ఫిక్స్ చేయడం దారుణమని అంటున్నారు. సినిమా టికెట్ ధరలు తగ్గించడమే కాకుండా..థియేటర్స్ లలో భద్రత లోపాలు ఉన్నాయని..ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని థియేటర్స్ ను సీజ్ చేయడం మరి దారుణమని వాపోతున్నారు. ఇప్పటికే చిత్రసీమ లోని పలువురు వైసీపీ సర్కార్ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..ఇతర పార్టీలనేతలు సైతం జగన్ తీరును తప్పుపడుతున్నారు.

తాజాగా తెలుగుదేశం నేత సోమిరెడ్డి జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పేదలకు ఏదో ప్రయోజనం చేశామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అదే పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందన్న విషయాన్ని గమనించడం లేదన్నారు. ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినీ పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 125 థియేటర్లు మూతపడ్డాయని, సినిమా థియేటర్లలో గంజాయి ఏమైనా ఉందా? అని నిలదీశారు. రాత్రి వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని సోమిరెడ్డి అడిగారు. తెలంగాణలో రైతుబంధు కింద రూ.10వేలు ఇస్తున్నారని.. అలాంటి పథకాలతో పోటీ పడాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా సోమిరెడ్డి చేసిన కామెంట్స్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. నిజంగా ముగ్గురి హీరోలను టార్గెట్ చేసుకొనే..జగన్ ఇలా చేస్తున్నాడా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ”తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో ఉంది. ఏపీలో లేదు. కానీ 70శాతం ఆదాయం ఏపీ నుంచే వస్తోంది. లైట్‌ బాయ్‌ నుంచి స్టార్‌ హీరో వరకు ప్రతి ఒక్కరూ ఏపీ నుంచి సంపాదిస్తున్నారు. టాలీవుడ్‌ పెద్దలు ఏపీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెట్టేందుకు ముందుకు రావాలి” అని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ బట్టి చూస్తే ఏపీలో చిత్రపరిశ్రమ లేదు కాబట్టే ఇలా చేస్తున్నారని అర్ధమవుతుందని అనుకుంటున్నారు. మొత్తం మీద చిత్రసీమ vs జగన్ అన్నట్లు అయ్యింది.