సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్

cs-somesh-kumar

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య సలహాదారుగా సోమేశ్‌కుమార్‌కు కేబినెట్‌ హోదాను ప్రభుత్వం కల్పించింది. గతంలో సోమేశ్‌కుమార్ తెలంగాణ సీఎస్‌గా పని చేసిన విషయం తెలిసిందే.

ఇక, ప్రభుత్వ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత నుంచి సోమేష్ కుమార్ భవిష్యత్ కార్యచరణపై అనేక రకాలు ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కేసీఆర్ సలహాదారుగా చేరుతారని లేదా రెరా చైర్మన్ అవుతారని లేదా బీఆర్ఎస్‌లో చేరి ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించనున్నారనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయనను సీఎం కేసీఆర్‌ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.