విభిన్న ఆలోచనల సమాహారమే ఆర్‌ఎస్‌ఎస్‌

సంస్థ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌

Mohan bhagwat
Mohan bhagwat


న్యూఢిల్లీ: హిందుస్థాన్‌ అంటే హిందువుల దేశమని ఆర్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థాపకులు కెబి హెగ్డేవార్‌ అన్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ చెప్పారు. ఒక పుస్తకావిష్కషరణలో పాల్గొనన్న ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ఒక నిర్దిష్ట భావజాలానికి కట్టుబడి ఉండదని, ఎన్నో ఆలోచన సమాహారం కూడా కాదని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రెండో అధినేత సంఘ్‌ ప్రధాన నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్‌ గోలార్కర్‌ ప్రసంగాల సంకలనమని ఆయన వ్యాఖ్యానించారు. ‘ది ఆర్‌ఎస్‌ఎస్‌ రోడ్‌మ్యాప్స్‌ ఫర్‌ ది 21వ సెంచరీ అనే పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌ భగవత్‌ ప్రసంగిస్తూ వారసత్వంగా వచ్చిన ఈ సత్యాన్ని మేము విశ్వసిస్తాము, దీన్ని మార్చము. హిందువు అని చెప్పుకువారు ఒక్కరున్నా ఇది హిందూ దేశమేనన్నారు. సంఘ్‌ భావజాలం అంటూ ఏదీ లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదని మోహన్‌ భగవత్‌ చెప్పారు. సంఘ్‌ను నిర్వచించడానికి విదేశీ భాషల్లో సరైన పదజాలం లేదన్నారు. ది ఆర్‌ఎస్‌ఎస్‌ రోడ్‌మ్యాప్స్‌ ఫర్‌ ది 21వ సెంచరీ అనే పుస్తకం ఆర్‌ఎస్‌ ఎస్‌ విలువలను, దూరదృష్టిని వలంటీర్లకు తెలిపేందుకు దోహదపడుతుందన్నారు.

ఈ పుస్తకం చదవడం వల్ల సమాజంలోని ససమ్యలపై పోరాడేందుకు సహాయకంగా ఉండడమే గాక, ఆర్‌ఎస్‌ఎస్‌పై మోపిన తప్పుడు భావనలు కూడా తొలగిపోయాదని కూడా అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్ధం చేసుకోవడం అంత సులభం కాదని సర్‌ సంఘ్‌ చాలక్‌ అయిన తరువాతే తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఏమిటో తెలిసిందని గురూజీ వ్యాఖ్యానించారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, హనుమాన్‌, ఛత్రపతి శివాజీ, హెగ్డేవార్‌ తమకు మార్గదర్శకులని భగవత్‌ వ్యాఖ్యానించారు. భారతదేశం హిందూ దేశం. తమను తాము హిందువులమని కాకుండా భారతీయులమని చెప్పుకునేవారు హిందువులే అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/