అత్త, ఆడపడుచుతోనే సమస్య అంతా!

‘మనస్విని’ మానసిక సమస్యలకు పరిష్కారం

psychological problems
psychological problems

మేడమ్‌ నా వయసు 40 సంవత్సరాలు. నాకు ఒకపాప ఉంది. మేమిద్దరం ఉద్యోగం చేస్తున్నాం. మా పాప పదవతరగతి చదువుతోంది. మాది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే. కానీ ఆ అత్తగారు, ఆడపడచుల వల్ల మా ఇద్దరిమధ్య గొడవలు వస్తున్నాయి.

వారికి మా ఆస్తిమీద బాగా ఆశలు ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. నా భర్త వారికి ఇస్తూ ఉంటారు. నేను ఏమైనా అభ్యంతరం చెప్తే నా మీద పోట్లాటలు పెట్టుకుంటున్నారు.

నాకు చాలా కుంగుబాటుగా ఉంది. ఈ విషయమై ఎలా బయటపడాలి ఈ బాధల నుండి? కొంచెం వివరించండి ప్లీజ్‌. శ్రీలక్ష్మి, హైదరాబాద్‌

మీరు తప్పక విజ్ఞ్ఞత నేర్చుకోవాలి. జీవననైపుణ్యాలు నేర్చుకోవాలి. సానుకూలంగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు తప్పక ఈ సమస్యల నుండి బయటపడగలరు.

ఏ పనిలోనైనా స్పష్టత, అవగాహన ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. గృహవాతావరణం ఆనందంగా ఉంచుకోవాలి.

ఇది తప్పనిసరి. కుటుంబ సభ్యులందరూ పరస్పరం గౌరవించుకోవాలి. మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి.

ఎవరికివారు తమ వ్యక్తిగత విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి. ఇతరులను ఇ్బంది కలిగించకూడదు.

ఇతరుల స్వేచ్ఛను అడ్డుకోకూడదు. ఎదుటివారివిలువలను, అలవాట్లను గౌరవించాలి. సన్నిహితుల మధ్య వ్యవహారాలు సున్నితంగా ఉంటాయి.

అందువల్ల వాటిని తగు రీతిలో ప్రోత్సహించుకోవాలి. స్వయంశక్తీకరణ ద్వారా, ఇతరులపై భారంగా ఉండకూడదు.

నైతిక విలువలు పాటిస్తూ జీవననైపుణ్యాలను అనుసరిస్తూ, ఆనందంగా, వర్తమానంలో జీవించాలి. దైనందిన జీవిం ఆనందంగా గడపాలి. జీవితం విలువ గుర్తించాలి.

జూనియర్‌కి ప్రమోషన్‌తో బాధ

మేడమ్‌ నా వయసు 30 సంవత్సరాలు. నేను గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాను. నాతో పనిచేసే, ఇంకో ఆమెకు ప్రమోషన్‌ వచ్చింది. నాకు రాలేదు. వాస్తవంగా నాకంటే ఆమె జూనియర్‌.

నా తర్వాత జాయిన్‌ అయ్యింది. అయినా ఆమెకు ప్రమోషన్‌ వచ్చింది.

అందువల్ల నాకు చాలా డిప్రెషన్‌గా ఉంది. ఒత్తిడిగా అనిపిస్తోంది. నాకంటే తర్వాత వచ్చిన అమ్మాయి కింద నేను పనిచేయాల్సి వచ్చిందే అని బాధపడుతున్నాను.

నేను ఏం చేయాలి,ఈ బాధ నుండి ఎలా బయటపడాలినో వివరించండి. – కమలకుమారి, వరంగల్‌

మీరు తప్పక ఈ బాధల నుండి బయటపడగలరు. అందులో సందేహం లేదు. మీ ఉద్యోగం మీది. వేరేవారితో సంబంధం లేదు.

అయినా మీకిష్టమైతనే ఏపనైనా చేయాలి. మీరు ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. వేరే వ్యాపారం ఏదైనా చేయవచ్చు.

అంతా మీ ఇష్టం ప్రక్రారం చేయవచ్చు. ఏదీ బలవంతం లేదు. అయినా మనిషికి గుర్తింపు తన ఆత్మవిశ్వాసం వల్ల వస్తుంది.

ఆత్మస్థయిర్యం, ధైర్యం, పనితనం వల్ల వస్తుంది. ప్రమోషన్‌ అనేది ఒకరకమైన మార్గం మాత్రమే.

ఇంకా రకరకాల మార్గాల ద్వారా మీకు సంతృప్తి వస్తుంది. మీ మార్గం మీరు ఎంచుకోండి.

అన్నింటికంటే ముఖ్యమైనవి శాంతంగా ఉండటం, సంతృప్తిగా ఉండటం ఆనందంగా ఉండటం.

అవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మన ఆనందం కోసం వేరే వారి మీద, వేరే వాటిమీద ఆధారపడి ఉండకూడదు.

మీ ఆనందం మీ వివేకం మీద ఆధారపడి ఉంది.

మీ అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. వేరే వారి శ్రేయస్సు కూడా మీరు ఆమోదించాలి. వేరేవారి ఉన్నతి కూడా మీరు స్వీకరించాలి.

ఎందువల్లనంటే, అన్ని కూడా మీ వద్ద కూడా ఉన్నాయి. జీవితం అనే వరం మీ దగ్గర ఉంది. జీవితం అనే అమూల్య మైన కానుక మీ వద్ద ఉంది. మీరు ఎంతో ఆనందంగా జీవించగలరు.

-డా. ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/