దేశవ్యాప్తంగా రాహుగ్రస్త సూర్యగ్రహణం
తొలిసారిగా గుజరాత్‌లోని ద్వారకలో ఆవిష్కృతం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ ఆదివారం రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడింది.. దీంతో విశ్వంలో మరో ఖగోళ అద్భుతం ఆవిష్కృత మైనట్టైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సూర్యగ్రహణం ఉదయం 9.16 గంటల నుంచి మొదలైంది. అయితే భారత్‌లో 10.14 గంటలకు పూర్తిస్థాయిలో గ్రహణం కన్పించింది..
తొలుత మనదేశంలో గుజరాత్‌లోని ద్వారకలో కన్పించింది.. కాగా ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యుడు సాక్షాత్కరించాడు..
అయితే రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది.. ఇదిలా ఉంటే గ్రహణం ప్రభావంతో భూమిమీద పడే అతినీల రోహిత కిరణాల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు..
గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా పలు ఆలయాలను మూసివేశారు. గ్రహణం వీడిన తర్వాత పూర్తిస్థాయిలో సంప్రోక్షణ జరిపి ఆలయాలను తెరిచి భక్తులకు స్వామివార్ల దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/