క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి

తెలంగాణ లో గుండెపోటులు ఆగడం లేదు..ప్రతి రోజు పదుల సంఖ్యలో గుండెలు ఆగిపోతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ.. మాట్లాడుతూ..ఇలా కూర్చున్న చోటే కుప్పకూలిపోతున్నారు. తాజాగా క్రికెట్ ఆడుతూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచిన ఘటన కూకట్ పల్లి లో చోటుచేసుకుంది.

కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటున్న మణికంట వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి స్టేడియానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతుండగా ఒక ఓవర్ బౌలింగ్ చేసి కార్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. మణికంఠ కారులో అలాగే తుది శ్వాస విడిచాడు. మణికంఠ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మణికంట మృతి తో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.