కమ్మకార్పొరేషన్‌ కోసం ఉద్యమం

Social Media
Social Media

కమ్మ కార్పొరేషన్‌ కోసం ఉద్యమం

పేదకమ్మవారికి రాయితీపై రుణాలు ఇవ్వాలంటూ డిమాండ్‌
– సామాజికమాధ్యమాల్లో ఊపందుకుంటున్న ఉద్యమం

గన్నవరం(కృష్ణా): అగ్రకులంలో ఉన్న కమ్మకులానికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలనే నినాదంతో కృష్ణాజిల్లా వేదికగా ఉద్యమం మొదలైంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈఉద్యమ ప్రచారం హోరేత్తుతుంది. ఇప్పటి వరకు కమ్మ సామాజికవర్గం అంటే ఉన్నత వర్గం అన్న అపోహను తొలగించి, ఇందులోనూ 60శాతం మందికి పైగా పేద, మద్యతరగతి, 20శాతం మంది నిరుపేదలు ఉన్నారన్న సంగతిని ప్రపంచానికి తెలియచేయాలని, నిరుపేదలకు అసరా కల్పించాలనే సంకల్పంతో ఈఉద్యమం ప్రారంభ మైంది. అన్ని వర్గాలకు అడగకుండానే వరాలు ఇస్తున్న టిడిపి ప్రభుత్వం తమకూ ఓకార్పోరేషన్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా పేద కమ్మవారికి రాయితీ రుణసౌకర్యం కల్పించాలని, విద్యార్దులకు ఫీజురీయంబర్స్‌మెంట్‌ ఇవ్వాలని, ఉపకారవేతనాలు మంజూరు చేయటంతోపాటు, యువతుల వివాహాలకు చంద్రన్న పెళ్ళికానుకను తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఈవర్గప్రజలు కోరుతున్నారు.
సామాజికమాధ్యమాల్లో కృష్ణాజిల్లాలో ప్రారంభమైన ఈఉద్యమం దాదాపు మన రాZషంలోని అన్ని జిల్లాలకు పాకింది. వాట్సప్‌, పేస్‌బుక్‌లలో జిల్లాల వారిగా గ్రూప్‌లు ఏర్పాటు చేస్తూ ఉద్యమ కార్యాచరణపై సూచనలు, సలహాలు స్వీకరిస్తూ, చర్చోపచర్చలు జరుపుతున్నారు. తమ సామాజికవర్గంలోని పేదలకు మేలు చేయాలన్న తలంపుతో సామాజిక మాధ్యమాల్లో కమ్మకార్పోరేషన్‌ సాధన సమితి, కమ్మకార్పోరేషన్‌, అఃలభారత కమ్మఐక్యవేది అంటూ విభిన్న రంగాల్లోని కమ్మసామాజికవర్గ ప్రజలతో గ్రూపులు ఏర్పాటు చేసారు. ఈగ్రూపుల్లో అన్ని రాజకీయపార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారు.రాజకీయాలకు అతీతంగా సాగే ఈఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాZష జనాభాలో దాదాపు 6శాతం మంది కమ్మజనాభా ఉన్నట్లు ఓఅంచనా. దాదాపు అన్ని రాజకీయపార్టీలోనూ ఈకులానికి చెందిన నాయకులు అగ్ర స్థాయిలోనే ఉన్నారు. రాZషవ్యాప్తంగా మెజార్టీ గ్రామాల్లో ఈకులం నాయకులదే హవా ఇప్పటికీ కొనసాగుతుంది. మెజార్టీ గ్రామాల్లో ఈసామాజిక వర్గానిదే ఆదిపత్యం కొనసాగుతుండగా, గ్రామాల్లో ఇతర సామాజిక వర్గాల ప్రజలు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈకులం మద్దతు ఉంటే రాZషంలో అధికారంలోకి రావటం ఖాయమన్న సంగతిని అందరూ అంగీకరిస్తారు.

ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈకమ్మసామాజికవర్గం ఏప్రభుత్వం అధికారంలో ఉన్నా నిరాదరణకు, అణచివేతకు గురవుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న ఈకులం గతంలో ఓవెలుగు వెలిగింది. ప్రస్తుతం వ్యవసాయంలో పెట్టుబడులు భారం కావటం, వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టు బాటుధరలు లభించకపోవటం, కూలీల కొరత వేధిస్తుండటంతో ఈవర్గంలోని 5ఎకరాలకు పైగా వ్యవసాయభూములు ఉన్న రైతులు సైతం ప్రస్తుతం గడ్డుపరిస్ధితులను అనుభవిస్తున్నారు. దేశానికి అన్నం పెట్టిన వీరు నేడు వ్యవసాయంలో వచ్చే ఆదాయం చాలక పిల్లలను ఉన్నత చదువుల కోసం ఉన్న వ్యవసాయ భూములను తెగనమ్ముకుని కడుపేదలుగా మారుతున్నారు. భూమినే నమ్ముకున్న ఈవర్గానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు భూమిని తెగనమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

మారిన కాలమాన పరిస్థితుల్లో ఈసామాజిక వర్గానికి చెందిన ప్రజలు కొన్ని చోట్ల వ్యవసాయ కూలీలుగా రూపాంతంరం చెందారు, ఇంకొన్ని ప్రాంతాల్లో రోజువారి కూలీలుగానూ జీవనం సాగిస్తున్నారు. ఎన్‌టిఆర్‌ తెలుగుదేశంపార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సమయంలో వ్యవసాయ విద్యుత్‌ బిల్లులో భారీగారాయితీలు ఇవ్వటంతో వీరికి బాగా కలిసొచ్చింది. దీంతో ఈసామాజిక వర్గం ఓటర్లు 90శాతానికి పైగా తెలుగుదేశానికి అండగా ఉన్నారు. అదే తీరును కొనసాగిస్తూ ఇప్పటికి మెజార్టీ ఓటర్లు టిడిపికే మద్దతునిస్తున్నారు. సాధారణంగా టిడిపికి అండగా ఉండే ఈసమాజికవర్గానికి టిడిపి అధికారంలో ఉన్నపుడు చేసింది ఏమీ లేదన్న భావన ఈవర్గప్రజల్లో వ్యక్తం అవుతుంది. కమ్మసామాజిక వర్గానికి ఏదైనా మేలు చేస్తే స్వంతకులానికి చేసుకున్నారన్న అపవాదు వస్తుందన్న అనుమానంతో అటు ఎన్‌టిఆర్‌ నుండి ఇప్పటి సియం చంద్రబాబు వరకు ఈసామాజికవర్గానికి చేసింది ఏమీలేదన్న అసంతృప్తి ఈవర్గం ప్రజల్లో బలపడుతుండగా, వాస్తవ పరిస్థితులు కూడా అందుకు ఏమాత్రం భిన్నంగాలేవు. ఉన్నత వర్గాలోని కాపులకు కార్పోరేషన్‌ ఏర్పాటు చేయటంతోపాటు, వారికి రిజర్వేషన్‌ కల్పించేందుకు టిడిపి ప్రయత్నిస్తుండగా, బ్రాహ్మణులకు, వైశ్యులకు కార్పోరేషన్‌లు ఏర్పాటు చేసి రాయితీపై రుణాలు ఇస్తుండటంతో ఈవర్గం ప్రజలు తమకూ కార్పోరేషన్‌ కావాలని కోరుతున్నారు.

ఇప్పటికే ఈసామాజికవర్గంలోని పేద విద్యార్దులకు ఈసామాజికవర్గంలోని ఆర్దికంగా బలవంతులు విరాళాలతో కమ్మసేవాసమతి ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుండగా, ప్రభుత్వం పరంగానూ సాయం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌టిఆర్‌ తెలుగుదేశంపార్టీని ఏర్పాటు చేయక ముందు రాZషవ్యాప్తంగా రాజకీయం మొత్తం కమ్మ, రెడ్డిసామాజికవర్గాల చుట్టూ తిరుగుతూ ఉండేది. ఎన్‌టిఆర్‌ పార్టీ పెట్టిన తరువాత మిగిలిన సామాజిక వర్గాల్లో రాజకీయచైతన్యం పెరగటంతో ఈరెండు సామాజికవర్గాలకు రాజకీయప్రాధాన్యత కొంత మేరకు తగ్గిందని చెప్పవచ్చు. తమ గుప్పిటలో ఉన్న రాజకీయాన్ని అన్ని వర్గాలకు పంచటంతో తమ ఆదిపత్యం తగ్గిందని ఈవర్గం ప్రజల్లో ఎన్‌టిఆర్‌పై కొంత అసంతృప్తి ఉంది.

కమ్మసామాజిక వర్గం నాయకులు కులాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వస్తున్నారని, వచ్చిన తరువాత స్వంత మనుషులకు, అనూయులకు మినహా, కులానికి చేసేది ఏమీ ఉండటంలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కొంత మంది ప్రజాప్రతినిధుల వ్యవహారశైలి కూడా ఈకులంలో అసహనానికి కారణమవుతుంది. ఇదే సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ సామాజిక వర్గాన్ని దగ్గరకు రానివ్వటంలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల పని తీరు ఈసామాజికవర్గంలో తీవ్రఅసంతృప్తిని లేవదీస్తుంది.

ఎటూ టిడిపికి మద్దతుగా ఉంటారు ఎక్కడికీపోరు అన్న రీతిలో కొందరు ఎమ్మెల్యేలు ఈవర్గం ప్రజలను అసలు పట్టించుకోవటంలేదన్న అసంతృప్తి ఈవర్గం నాయకుల్లో బలంగా ఉంది. నెల్లూరుజిల్లాలో టిడిపికి చెందిన కమ్మసామాజికవర్గం నాయకులు తమను అణచివేస్తున్నారంటూ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏఇద్దరో ముగ్గురో అధికార భోగాలు అందుకుంటుంటే, మిగిలిన కులం అంతా కటిక దారిధ్య్రం అనుభవిస్తుండటం ఈకులం ప్రజల్లో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. ఏపార్టీ అయినా తమకు చేసేది ఏమీలేదంటూ పలువురు గ్రూపుల్లో తమ నిరసన గళం విప్పుతున్నారు. మరికొందరు మాత్రం టిడిపిలోనే తమ కులానికి మేలు కలిగింది అంటుంటే మరి కొందరు కాంగ్రెస్‌లోనే తమ కులానికి తగిన ప్రాధాన్య లభించిందంటూ ఉదాహరణలతో వివరిస్తున్నారు.

ఏది ఏమైనా ఎన్నికలలోపు కార్పోరేషన్‌ సాధించాలన్న తలంపుతో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసే వారికే ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేయాలంటూ తీర్మానాలు సైతం చేస్తున్నారు. కమ్మకార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ త్వరలో రాZషముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును, ప్రతిపక్షనేత వైఎస్‌.జగన్‌కు కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

ఈనెల మొదటి వారంలో విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పాలభిషేకం చేసి బహిరంగ ఉద్యమానికి సిద్దం కాగా రాజ్యసభ మాజీ సభ్యులు హరికృష్ణ ఆకస్మిక మృతితో ఈకార్యక్రమం వాయిదా పడింది. త్వరలో మరో కార్యక్రమం ద్వారా ఉద్యమాన్ని బహిరంగ పరచటంతోపాటు, ఉదృతం చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. కమ్మకార్పోరేషన్‌ సాధనే ధ్యేయంగా సాగుతున్న ఈఉద్యమం తీవ్ర రూపం దాల్చి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందో…..లేక సామాజిక మాధ్యమాల్లోనే మిగిలిపోతుందో వేచి చూడాల్సిందే.