లగడపాటి సర్వే బోగస్‌ సర్వే

Lagadapati Rajagopa
Lagadapati Rajagopa

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ చెప్పే సర్వేలు బోగస్‌ సేర్వేలని మరోసారి రుజువైంది. గతంలో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే బుక్కయ్యాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాగే బోగస్‌ సేర్వే చేశారు.ఈ సారి ఎన్నికల్లో మళ్లీ టిడిపినే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాడు. ఇతర జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఏపీలో వైఎస్‌ఆర్‌సిపి గెలుస్తుందని చెబితే.. ఈయన ఒక్కడు మాత్రం ఏపీలో టీడీపీదే మళ్లీ అధికారం అంటూ పనికిమాలిన సర్వేను ప్రకటించాడు. కానీ.. ఇవాళ్టి ఫలితాలను చూస్తే లగడపాటి సర్వే.. ఓ చెత్త సర్వే అని తేలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా వైఎస్‌ఆర్‌సిపి బద్దలు కొట్టి.. ప్రస్తుతం 150 సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. దీంతో నెటిజన్లు లగడపాటిపై విమర్శల వర్షం కురిపించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/